తండ్రి–కూతురి ప్రేమను చాటిన ‘ఇరుముడి’
భావోద్వేగానికి గురైన తాడిచెర్ల గ్రామ ప్రజలు
మల్హర్ ,సెప్టెంబర్సె ప్టెంబర్ 21(చక్రవాణి న్యూస్) :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో ఫ్రెండ్స్ గజానన మండలి ఆధ్వర్యంలో ‘ఇరుముడి’ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. తండ్రి–కూతురి మధ్య ఉండే ఆప్యాయత, ప్రేమ, అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రం గ్రామ ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది.సినిమా వీక్షించేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమాలోని పలు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల కళ్లలో కన్నీళ్లు తెప్పించాయి. ముఖ్యంగా తండ్రి–కూతురి ప్రేమను ప్రతిబింబించిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారు.సినిమాలో హీరో రవితేజతో పాటు చిత్రాన్ని రూపొందించిన దర్శకులు, నటీనటులు, సాంకేతిక బృందాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలను ప్రతిబింబించే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామ ప్రజలకు మంచి సందేశాన్ని అందించే చిత్రాన్ని ప్రదర్శించిన ఫ్రెండ్స్ గజానన మండలి కమిటీ సభ్యులను గ్రామస్థులు అభినందించారు. వినోదంతో పాటు కుటుంబ బంధాల విలువను చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.సినిమా ప్రదర్శనకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తాడిచెర్లలో ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీ చక్రవాణి న్యూస్
నేటి అక్షర ధ్వని
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
అవినీతిపై సుదర్శన చక్రం!
ప్రజల మాట.. మా అక్షరం

