తాడిచర్ల కళాశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
ʼసందరెల్లి విశ్వేశ్వర ఆలయం’ డాక్యుమెంటరీ రీల్‌కు ప్రథమ బహుమతి
మల్హర్, సెప్టెంబర్ 26 (చక్రవాణి న్యూస్): ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ నెల 22న భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థులు బండి శివమణి, లంకపల్లి సందేశ్, ఆర్. ఈశ్వర్ బృందం ‘సందరెల్లి విశ్వేశ్వర ఆలయం’పై రూపొందించిన డాక్యుమెంటరీ రీల్‌కు ప్రథమ బహుమతి లభించింది. పాండవుల గుట్ట వద్ద నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా విద్యార్థులు రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ విజయదేవి, అధ్యాపకులు అభినందించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
