తాడిచర్ల అంగన్వాడీ-8లో ఘనంగా పోషణ మాసం
పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజం.. సర్పంచ్ బండి స్వామి
మల్హర్, సెప్టెంబర్ 26 (చక్రవాణి న్యూస్): మండల కేంద్రమైన తాడిచర్లలోని అంగన్వాడీ-8 కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే పోషణ మాసం ప్రధాన ఉద్దేశమన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహార సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఆయా స్నేహ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
