తాడిచెర్లలో 132 కేవీ సబ్‌స్టేషన్ పనులు వేగవంతం చేయాలి.. విద్యుత్ సిఎండి వరుణ్ రెడ్డి
మల్హర్, సెప్టెంబర్ 30 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచెర్లలో ప్రతిపాదించిన 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని విద్యుత్ సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సబ్‌స్టేషన్ ప్రతిపాదిత స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. తాడిచర్ల , పరిసర గ్రామాల్లో లో-వోల్టేజ్, విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్ కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి , ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ , విద్యుత్ శాఖ ఎస్ఈ సదానందం, తహసీల్దార్ రవికుమార్, ఏఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
