సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు చుక్కెదురు
అనర్హత వేటును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం
హైదరాబాద్ సెప్టెంబర్ 24(చక్రవాణి న్యూస్) : ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హతను సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
