కాళేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.. బాలాలయంలో ప్రత్యేక పూజలు
కాళేశ్వరం, సెప్టెంబర్ 22 (చక్రవాణి న్యూస్): కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న పునర్నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.అనంతరం గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టడం, ఆలయ పరిసరాల్లో మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు


