పాముకాటుతో రైతు మృతి
వ్యవసాయ పనులు చేస్తుండగా ఘటన.. చికిత్స పొందుతూ మృతి
మల్హర్, సెప్టెంబర్ 20(చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచెర్లలో పాముకాటుతో రైతు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తాడిచెర్లకు చెందిన కందుల మల్లయ్య (52) శనివారం ఎప్పటిలాగే వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పాము కాటేసింది.వెంటనే స్థానిక రైతులు మల్లయ్యను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందాడు.మృతుడికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లయ్య మృతి తో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

