తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

పదేండ్లలో గిరిజన సంక్షేమానికి కృషి చేసింది కేసీఆరే..

 


- కాంగ్రెస్‌వి మాటలు తప్ప మూడేళ్లలో చేసిందేమీ లేదు

- ఎస్టీ డిక్లరేషన్‌ అమలు కావాలంటే చైతన్యం రావాలే

- మానీఫెస్టో రాసి సబ్బండ వర్గాలను మోసం చేసిన ఘనుడు దుద్దిళ్ల

- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మల్హర్, సెప్టెంబర్ 17(చక్రవాణి న్యూస్) :సాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు చేసిన కేసీఆర్‌ ప్రభుత్వంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ది జరిగిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.  మల్హర్‌ మండలం దుబ్బపేట గ్రామపంచాయతీ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్‌ ప్రభుత్వంలోనే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి పరిపాలన వారి చేతులకు అప్పగించిన చరిత్ర కేసీఆర్‌దని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు మేలు చేయాలన్న సంకల్పంతో  ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌ ఫండ్‌ కింద 13వేల412కోట్లను కేటాయించారని, ఎస్టీ రిజర్వేషన్‌లను ఆరు నుంచి 10శాతం పెంచిన ఘనత కేసీఆర్‌దేనని వివరించారు. ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుందని, మూడేళ్లలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.  కేసీఆర్‌ ప్రభుత్వం గిరిజనులను అభివృద్ది, వారి వ్యవసాయ భూములను అభివృద్ది చేయాలని గిరి వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చారని, పంట పొలాల్లో బోర్లు వేసి సాగులోకి తీసుకుచ్చారని అన్నారు. 2022 డిసెంబర్‌ నాటికి 19698మంది రైతులకు 56613ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చారని, 1682అవాసాల్లో రోడ్డు నిర్మాణాలు, నీటి సౌకర్యాలు, విదేశీ విద్య, కేసీఆర్ కిట్లు, గిరిజన యువకులకు వాహనాలు, మేడారం నాగోబా,  సమ్మక్క సారలమ్మ జాతరలకు ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేశారని తెలిపారు. 8లక్షల23వేల 780మంది రైతులకు రూ.7350కోట్లు ఇచ్చిన చరిత్రను మర్చిపోవద్దన్నారు. పాలకుర్తి మండలంలో బామ్లానాయక్‌, మల్హర్‌ మండలంలో దుబ్బపేట, మహముత్తారం మండలంలో ప్రేమనగర్‌ తండా,  పలిమెల మండలంలో మోదేడులను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గిరిజన అభివృద్ది కోసం గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు ఐఐటీ, నీట్‌ కోచింగ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ ఇంత పెద్ద ఎత్తున ఎస్టీ గిరిజన ఆదివాసీల కోసం ఎంతో గొప్పగా చేస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌  మానీఫెస్టో చైర్మన్‌గా తమను ప్రజలు నమ్మరని  ఎస్టీ డిక్లరేషన్‌ చేసి ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశాడని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు, మూడు కొత్త ట్రైబల్‌ కార్పోరేషన్‌లు,  ఐదు ఐటీడీఏలు అని చెప్పి ఇప్పటికి వాటికి అతీగతీ లేదని విమర్శించారు. కొత్తగా గిరిజన కార్పోరేషన్‌లు ఏర్పాటు చేసి గ్రాంట్‌ ఇస్తమన్నారని, ఎస్టీ సర్పంచ్‌లు ఉన్న పంచాయతీల్లో ప్రతి ఏటా 25లక్షలు, సమ్మక్క సారక్క గిరిజన అభివృద్ది పథకం కింద పదోతరగతి పాసైతే 10వేలు, ఇంటర్‌ పాసైతే రూ. 15వేలు,  డిగ్రీ పాసైతే రూ 25వేలు. పీజీ 1లక్ష. పీహెచ్‌డీకి 25లక్షలు ఇస్తమని మోసం చేసిన ఘనుడు దుద్దిళ్ల శ్రీధర్‌ అని అన్నారు. ఈ గిరిజన తండాకు వెళ్లినా పదేండ్లలో కేసీఆర్‌ చేసినవే కనుబడుతాయని, కాంగ్రెస్‌ పార్టీ ని అర్థం చేసుకోకపోతే మనల్నీ మోసం చేయడానికి వెనుకాడరని అన్నారు.ఎస్టీ డిక్లరేషన్‌లు అమలు కావాలంటే గిరిజనుల్లో చైతన్యం రావాలని, మహనీయులు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌, కొమురం బీంలాంటి మహనీయుల  పోరాట స్పూర్తితో ముందుకు వెళ్లాలని అన్నారు. గిరిజనుల కోసం ఏదైనా జరిగిందంటే అది కేసీఆర్‌ ప్రభుత్వంలోనే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో brs మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, సర్పంచ్లు భూక్య రవీందర్, అజ్మీరా సారక్క,అజ్మీరా బాలాజీ నాయక్,ex zptcగోనె శ్రీనివాస్,కోట రవి, చెప్యల రామారావు, యాదగిరిరావు,తాజుద్దీన్, ఉప సర్పంచ్లు పురుషోత్తం రావు, రాజేందర్, పులుగంటి రాములు, డిల్లీ రాజు,అజ్మీరా రాజు నాయక్, నారా రమేష్, అజ్మీరా శంకర్, మధుసూదన్, శ్రీశైలం, శ్యామల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.



Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains