ప్రజావాణి అర్జీలకు గడువులోగా పరిష్కారం.... భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (చక్రవాణి న్యూస్): ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 18 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి, వారంలోగా పరిష్కరించాలని సూచించారు. తీసుకున్న చర్యల వివరాలను సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
