41వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రజక సంఘం నాయకులు
మల్హర్, సెప్టెంబర్ 10(చక్రవాణి న్యూస్) :తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచర్ల గ్రామంలోని ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు కామ బాపు, తిర్రి అశోక్, పైడాకుల దేవేంద్ర, రాజ్యసమ్మయ్యతో పాటు రజక సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు, ఉపాధ్యక్షుడు కనుకుల రాకేష్, ప్రధాన కార్యదర్శి పైడాకుల సమ్మయ్య పాల్గొన్నారు.అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు పైడాక లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు పైడాకుల రాజసమ్మయ్య, పైడాకుల గంగన్న, పైడాకుల రాజేశం, జాలిగం కిట్టు, రాచర్ల చందు, కోడిపుంజుల ఓదెలు, నస్పూరి కనకయ్య, కోడిపుంజుల సాంబయ్య, పైడాకుల సాయికృష్ణ, నిమ్మల కేదారి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

0 Comments