పారాక్వాట్‌పై కేంద్రం కఠిన నిర్ణయం........ ప్రమాదకర కలుపు మందు వినియోగానికి ఇక చెక్
న్యూఢిల్లీ, (చక్రవాణి న్యూస్) : మనుషులు, జంతువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర కలుపు సంహారకం పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు ఉన్న రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో పాటు, కొత్తగా ఈ రసాయనానికి రిజిస్ట్రేషన్లు ఇవ్వకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిపుణుల కమిటీ సిఫార్సులు, రిజిస్ట్రేషన్ కమిటీతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.జూలై 10న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం తుది ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో పారాక్వాట్ డైక్లోరైడ్‌ను నిషేధించిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
