మాల మహానాడు మల్హర్ మండల అధ్యక్షుడిగా పసుల పోచయ్య
ఏకగ్రీవంగా నియామకం.. నియామక పత్రం అందజేసిన రాష్ట్ర నాయకులు బండి రాజయ్య
మల్హర్రావు, సెప్టెంబర్ 20 (చక్రవాణి న్యూస్) :జాతీయ మాల మహానాడు మల్హర్రావు మండల అధ్యక్షుడిగా వల్లెంకుంటకు చెందిన పసుల పోచయ్య ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఆదివారం కొయ్యూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండి రాజయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి మధూకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్లా ప్రభాకర్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు తెలిపారు. మండలంలో సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పోచయ్య పేర్కొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
