రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు మోడల్ స్కూల్ విద్యార్థులు
జూనియర్ అథ్లెటిక్స్‌లో జిల్లా తరఫున నలుగురికి అవకాశం
మల్హర్రావు, సెప్టెంబరు 25 (చక్రవాణి న్యూస్) : ఎడ్లపల్లి మోడల్ స్కూల్ అండ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో జరిగే పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు.షాట్‌పుట్‌లో బండి గణేష్, కొడారి హిమజ, లాంగ్‌జంప్‌లో పుట్ట సంకీర్తన, 100 మీటర్ల పరుగులో పోలం నిత్య పోటీ పడనున్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ సీహెచ్. పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు అభినందించారు. శిక్షణ అందించిన పీటి పక్కల రాజబాబు, కోచ్ హాట్కార్ రఘువీర్, మేనేజర్ లావుడ్యా సారయ్యలను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
