అంగన్వాడీ ఎంపికపై సీడీపీవో స్పష్టత.. జిపిల్లో అర్హుల, అనర్హుల జాబితా ప్రదర్శన
మహదేవ్పూర్, సెప్టెంబర్చ 26 క్రవాణి న్యూస్ : అంగన్వాడీ కొలువుల్లో స్థానికతపై సందేహాలు, వివాహం తర్వాత స్థానికత ఎలా నిర్ణయిస్తారనే అంశంపై శనివారం చక్రవాణి న్యూస్లో ప్రచురితమైన కథనానికి మహదేవ్పూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో రాధిక స్పందించారు.అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన, అనర్హులైన వారి జాబితాను సంబంధిత గ్రామపంచాయతీల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు వాటిని తెలియజేయవచ్చని సీడీపీవో రాధిక స్పష్టం చేశారు.

