ఎల్నినో కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
నీరు ఉన్నా పంటలకు అందడం లేదని ఆరోపణ.. దేశిటిక్యాల్లో ఎండిన పంటల పరిశీలన
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 27 (చక్రవాణి న్యూస్) : తెలంగాణలో పంటలు ఎండిపోవడానికి ఎల్నినో కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని దేశిటిక్యాల్ గ్రామ శివారులో రైతులతో కలిసి ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వైపు నీటి విడుదలపై కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
