కొయ్యూరు అభివృద్ధికి ప్రణాళిక..... సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
మల్హర్, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్) : మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్–గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) 2026–27 ప్రత్యేక ప్రణాళిక సమావేశాన్ని మంగళవారం సర్పంచ్, మల్హర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్డు సభ్యుడు శశివర్ధన్తో కలిసి గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను గుర్తించారు. గ్రామస్తుల సూచనల మేరకు పనులకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి ప్రణాళికలో చేర్చారు.టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ వికసిత్ భారత్ లక్ష్యాలు, జీపీడీపీ ప్రాముఖ్యతను వివరించారు. మహిళా నాయకులు తేప్పల రజిత, వేమనూరి రమ, యువజన నాయకులు లాకావత్ రాజేందర్, దేవేందర్, గుంటి వెంకటేష్, వేల్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
