కొయ్యూరులో పోషణ మాసోత్సవాలు
కొండ రాజమ్మ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన
మల్హర్, సెప్టెంబర్ 30 చక్రవాణి న్యూస్ : పోషణ మాసం–2026లో భాగంగా కొయ్యూరులో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్, మల్హర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు, చిన్నారులు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లతో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. క్విజ్ విజేతలకు బహుమతులు అందజేసి, గర్భిణీకి శ్రీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, గర్భిణులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
