మృతుడి కుటుంబానికి చేయూత
సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్రావు ఆధ్వర్యంలో నగదు, బియ్యం అందజేత
మల్హర్, సెప్టెంబర్ 21(చక్రవాణి న్యూస్) : గ్రామపంచాయతీ పరిధిలోని 6వ వార్డు సభ్యుడు కోడిశాల మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.మాజీ సర్పంచ్ పోటు ప్రభాకర్ 25 కిలోల బియ్యం అందించగా, వార్డు సభ్యులు, గ్రామస్థులు కలిసి రూ.6,200 నగదును మృతుడి కుటుంబానికి అందించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శనిగరం శ్రీకాంత్, గ్రామశాఖ అధ్యక్షుడు శనిగరం రాజయ్య, రొడ్డ గోపాల్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
