మల్లేష్ కుటుంబానికి బీఆర్ఎస్ నేతల భరోసా
పరామర్శతో పాటు 50 కిలోల బియ్యం అందజేత
మల్హర్ , సెప్టెంబర్ 20(చక్రవాణి న్యూస్) :
అనారోగ్యంతో మృతి చెందిన కొండంపేట గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కోడిశాల మల్లేష్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించి అండగా నిలిచారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ అవసరాల కోసం 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంథని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయిని రాజన్న యాదవ్, మల్హర్రావు మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ, కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్ ఖాన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంచిక మల్లేష్ యాదవ్, కొండంపేట మాజీ సర్పంచ్ అడ్డూరి కుమారస్వామి, బీఆర్ఎస్ నాయకులు అక్కల బాపు యాదవ్, కొడారి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
నేటి అక్షర ధ్వని
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
అవినీతిపై సుదర్శన చక్రం!
ప్రజల మాట.. మా అక్షరం
