లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకం... టిఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్
తెలంగాణ ఉద్యమానికి, బలహీన వర్గాల కోసం ఆయన సేవలు చిరస్మరణీయం
భూపాలపల్లి, సెప్టెంబర్ 27 (చక్రవాణి న్యూస్) :ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వరాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కుల కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల హక్కుల కోసం బాపూజీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంలో పయనించడమే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
