కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ ఆకస్మిక తనిఖీ
మహాదేవపూర్, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్): కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్‌పై ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్లలో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్ కావడంతో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఐజీ సూచించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
