పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా... ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం.
ఖమ్మం, సెప్టెంబర్ 29(చక్రవాణి న్యూస్) : తెలంగాణలో పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించేలా పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. చింతకాని మండలం నాగులవంచలో జరిగిన బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
