హయత్‌నగర్‌లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌పై అనుమానాలు
తయారీ కేంద్రంపై పోలీసుల దాడి.. 730 కిలోల పేస్ట్ సీజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (చక్రవాణి న్యూస్):
హయత్‌నగర్‌లో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారవుతున్నట్లు అనుమానిస్తూ సుమారు 730 కిలోల పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.తయారీ కేంద్రంలో గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్ కూడా గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. పేస్ట్ తయారీలో వీటిని ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు.ఈ వ్యవహారానికి సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పేస్ట్, ద్రావణం, ఫుడ్ కలర్ వివరాలపై సంబంధిత అధికారులు తదుపరి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.పేస్ట్ తయారీ విధానం, వినియోగిస్తున్న పదార్థాల నాణ్యతపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
