ఆర్థిక మంత్రి ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా సిగ్గుచేటు:మాజీ మంత్రి హరీష్ రావు
15 శాతం కమిషన్ అడుగుతున్నారని రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. దేశంలో 6 డీఏలు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే!
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (చక్రవాణి న్యూస్) :
రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వంపై మరియు ఆర్థిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.సచివాలయం లోపలికి వెళ్లి, నేరుగా ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే ఉద్యోగులు ధర్నా చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదని హరీష్ రావు గుర్తుచేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్మును వెనక్కి ఇవ్వడానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్య 15 శాతం కమిషన్ అడుగుతోందని స్వయంగా బాధితులే ఆవేదన వ్యక్తం చేయడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.దేశంలోనే ఆరు డీఏలు (DA) పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, రిటైర్మెంట్ సొమ్ము కోసం కూడా కమిషన్లు డిమాండ్ చేసే స్థాయికి పాలన దిగజారిందని మండిపడ్డారు. నేరుగా సచివాలయంలో, మంత్రి కార్యాలయం ముందే ఈ తరహా నిరసనలు జరుగుతుండటం చూసైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిగ్గుతో తలదించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు

మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు