సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎడ్లపల్లిలో సోషల్ మ్యాపింగ్
వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికకు శ్రీకారం
మల్హర్, సెప్టెంబర్ 30 (చక్రవాణి న్యూస్) : మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సోషల్ మ్యాపింగ్ నిర్వహించారు. వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో భాగంగా గ్రామ ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన వివరాలను సేకరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శైలజ, వార్డు సభ్యులు లావుద్య రవీందర్, మేరుగు శ్రీనివాస్, రౌతు భీమయ్య, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
