దళారులను నమ్మి మోసపోవద్దు: పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
రామగుండం, సెప్టెంబర్ 25 (చక్రవాణి న్యూస్) : పెద్దపల్లి జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు దళారీల చేతిలో మోసపోవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణకు సేకరించిన భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నేరుగా నష్టపరిహారం అందుతుందని స్పష్టం చేశారు.ఎక్కువ పరిహారం ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన బాధితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని అధికారులే నేరుగా అందజేస్తారని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
