బీసీ రాజ్యాధికారమే లక్ష్యం... మల్లన్న మహా పాదయాత్ర
బీసీల హక్కులపై చైతన్యం కల్పిస్తూ మద్దూరు నుంచి నారాయణపేటకు కొనసాగిన యాత్ర
మద్దూరు, సెప్టెంబర్ 29 (చక్రవాణి న్యూస్): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రవ్యాప్త మహా పాదయాత్ర మద్దూరు నుంచి నారాయణపేట వరకు కొనసాగింది. బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, హక్కులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ యాత్ర సాగిందని పార్టీ నాయకులు మంగళవారం తెలిపారు.ఈ యాత్రలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల టిఆర్పీ పార్టీ ఇంచార్జ్ మేనం సంతోష్ పటేల్ పాల్గొని మల్లన్నకు సంఘీభావం తెలిపారు. టీఆర్పీ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
