తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

అంగన్వాడీ కొలువుల్లో స్థానికతపై సందేహాలు



తర్వాత స్థానికత ఎలా నిర్ణయిస్తారో చెప్పాలి.. అభ్యర్థుల డిమాండ్
భూపాలపల్లి, సెప్టెంబరు 25 (చక్రవాణి న్యూస్):
 

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24న నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ పోస్టుల ఎంపికలో స్థానికతను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.ముఖ్యంగా వివాహం అనంతరం భర్త నివసించే ప్రాంతానికి వెళ్లిన మహిళను ఏ ప్రాంతానికి స్థానికురాలిగా పరిగణిస్తారో స్పష్టం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామం, వార్డు లేదా ప్రాంతంలో వాస్తవంగా స్థిరనివాసం ఉన్న మహిళలకు అవకాశం కల్పించేలా నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. కేవలం ఆధార్‌, ఇతర ధ్రువీకరణ పత్రాల్లోని చిరునామాను మాత్రమే కాకుండా.. అభ్యర్థి వాస్తవంగా అక్కడ నివసిస్తున్నారా? అనే అంశాన్ని కూడా నిబంధనల ప్రకారం పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఉద్యోగం కోసం కొంతకాలంగా మాత్రమే ఒక ప్రాంతంలో నివసిస్తున్న అభ్యర్థుల స్థానికతను ఎలా నిర్ణయిస్తారో అధికారులు స్పష్టంగా వెల్లడించాలని కోరుతున్నారు. స్థానికంగా ఏళ్లుగా నివసిస్తున్న మహిళలకు అన్యాయం జరగకుండా ప్రతి అభ్యర్థి స్థానికతను నిబంధనల ప్రకారం నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కోవిడ్‌ బ్యాచ్‌ మార్కులపైనా స్పష్టత ఇవ్వాలి

కోవిడ్‌ సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సాధారణ పరీక్షలకు భిన్నంగా మార్కుల మూల్యాంకనం జరిగినందున.. ఆ మార్కులను అంగన్వాడీ పోస్టుల మెరిట్‌ ఎంపికలో ఏ విధంగా పరిగణిస్తారో స్పష్టం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. వివిధ బ్యాచ్‌లకు భిన్నమైన మూల్యాంకన విధానాలు అమలైన నేపథ్యంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా మెరిట్‌ జాబితా రూపొందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.వివాహ స్థితిని కాకుండా నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్థానిక నివాస అర్హతలను ప్రామాణికంగా తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అనంతరం తుది ఎంపికలో స్థానికత, ధ్రువీకరణ పత్రాలు, నోటిఫికేషన్‌లోని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

               మీ చక్రవాణి న్యూస్

అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరంతాజా వార్తలు
Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains