కొయ్యూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.
మల్హర్ , (చక్రవాణి న్యూస్) :
కొయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ-సమ్మయ్య గారు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సావేందర్, కార్యదర్శి పంచగిరి రాజు, కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ తెప్పల రజిత, వేమునూరి రమ, వార్డు సభ్యులు మధు, సరమ్మ, లక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నాయకులు ఆయుబ్, లచ్చన్న, వేల్పుల మహేందర్, రాజేందర్, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ శారద, సుదర్శన్, రాజు, జీపీ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




