పునరావాస జాబితాలో పారదర్శకత పాటించాలి
తాడిచర్ల భూ నిర్వాసితుల కమిటీకి, అధికారులకు యువత విజ్ఞప్తి
మల్హర్ , ఆగస్టు 03(చక్రవాణి న్యూస్) :
తాడిచర్ల గ్రామంలో భూ నిర్వాసితుల పునరావాస ప్రక్రియను న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని భూ నిర్వాసితుల కమిటీకీ , అధికారులకు పలువురు తాడిచర్ల డేంజర్ జోన్ యువత సోషల్ మీడియా వేదికగా కోరారు. ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన అసలైన అర్హులైన బాధితులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే, గతంలోనే 49 ఇళ్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ ప్లాట్ల ద్వారా లబ్ధి పొందిన కొందరి పేర్లు.. ప్రస్తుతం సిద్ధం చేస్తున్న పీఎన్ (PN) జాబితాలో మళ్లీ రావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారికే మళ్లీ మళ్లీ అవకాశం కల్పిస్తే, ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందని నిరుపేద, నిజమైన బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత లేకుండా ఒకే కుటుంబానికి లేదా వ్యక్తులకు పలుమార్లు లబ్ధి చేకూర్చడం వల్ల గ్రామంలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్థానిక భూ నిర్వాసితుల కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి.. న్యాయం, సమానత్వ సూత్రాల ప్రకారం పునరావాస లబ్ధిదారుల జాబితాను తక్షణమే సవరించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని సోోషల్ మీడియా వేదిక గ విజ్ఞప్తి చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

