చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించం: కాటారం సీఐ నాగార్జున రావు
ఇప్పలపల్లిలో పోలీసుల భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
మల్హర్ , జూలై 24(చక్రవాణి న్యూస్) : కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం సీఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్, కాటారం-2 ఎస్ఐ మహేష్ మరియు సిబ్బందితో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీఐ నాగార్జున రావు మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఎస్ఐ మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
