మండలంలోని రుద్రారం గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు, యూత్ నాయకులు కౌటం రవి పటేల్ - సౌందర్య ల వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు బూర్ల రాజయ్య సోదరుని వివాహ వేడుకల్లో సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను పుట్ట మధు ప్రత్యేకంగా ఆశీర్వదించి అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Page Advertisement [Top]
తెలంగాణ వార్తలుబ్రెకింగ్ న్యూస్భుపాలపల్లిభూపాలపల్లి
వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment