శ్రీ సాయి వాణి విద్యానికేతన్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

 39 ఏళ్లుగా విద్యాసేవలందిస్తున్న విద్యాసంస్థలో ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

మలహర్ ,సెప్టెంబర్ 5 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీ సాయి వాణి విద్యానికేతన్ పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ (టీచర్స్ డే) వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 39 సంవత్సరాలుగా విద్యాసేవలు అందిస్తూ, అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో జరిగిన వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ వీరమనేని సంపత్‌రావు నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తోటి విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. గురువుల బాధ్యతలను, సమాజంలో వారికున్న విశిష్ట స్థానాన్ని స్వయంగా తెలుసుకునేలా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ఉపాధ్యాయ వృత్తి విశిష్టతను చాటిచెప్పిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరిగింది.అనంతరం పాఠశాలల్లోని ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments