WHAT’S HOT NOW

ads header

Business

Theme images by kelvinjay. Powered by Blogger.

Comments

Recent

Bottom Ad [Post Page]

Search This Blog

Archive

Main Tags

Full width home advertisement

Keep Traveling

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

Post Page Advertisement [Top]

Life & style

Games

Sports

» »Unlabelled » వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి



పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, సెప్టెంబర్ 13 (చక్రవాణి న్యూస్): విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని సూచించారు.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీరాజ్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మార్గదర్శకాలను పాటిస్తూ భక్తి, భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాహుల్ శర్మ ఆకాంక్షించారు.

«
Next
This is the most recent post.
»
Previous
Older Post

No comments:

Leave a Reply