Comments
Recent
Search This Blog
Archive
Sports
Business
Life & style
Games
Footer Menu Widget
About Me
Full width home advertisement
Author Description
Most Popular
మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
Post Page Advertisement [Top]
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావనతో మరోసారి చర్చనీయాంశంగా మారిన భూవ్యవహారం
భూపాలపల్లి, సెప్టెంబర్ 17(చక్రవాణి న్యూస్) భూపలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాంతానికి సంబంధించిన 106 ఎకరాల భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 16న తెలంగాణ అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లిలో 106 ఎకరాల ఫారెస్ట్ భూములను తొలగించి రిజిస్ట్రేషన్ చేశారని, గండ్ర వెంకటరమణారెడ్డి పేరుతో 106 ఎకరాల ఫారెస్ట్ భూమి రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తాడిచెర్లలో గండ్ర వెంకటరమణారెడ్డి పేరుతో ఉన్నట్లు ప్రస్తావనకు వచ్చిన 106 ఎకరాల భూములు అసలు ఎక్కడ ఉన్నాయి? అవి ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూములా? లేక తాడిచెర్ల గ్రామ శివారులోని రెవెన్యూ భూములా? అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.సదరు 106 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ, అటవీ శాఖ రికార్డులు, సర్వే నంబర్లు, పట్టా వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, భూమి హక్కులు, లావాదేవీలు, భూమి వినియోగానికి సంబంధించిన వివరాలను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.భూములు ఏ ప్రాంతంలో ఉన్నాయో, వాటి వాస్తవ స్వరూపం ఏమిటో అధికారిక రికార్డుల ద్వారా స్పష్టం చేయాలని, అవసరమైతే సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు లేదా అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
COMMENTS