Comments
Recent
Search This Blog
Archive
Sports
Business
Life & style
Games
Footer Menu Widget
About Me
Full width home advertisement
Author Description
Most Popular
మల్హర్ ఆర్ఎంపీ, పీఎంపీ నూతన అడ్హాక్ కమిటీ ఎన్నిక
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి
Post Page Advertisement [Top]
వివిధ పాఠశాలల నుంచి ప్రతిభ ఆధారంగా ఎంపిక.. పేర్లు వెల్లడించిన ఎంఈఓ లక్ష్మణ్ బాబు
మల్హర్, సెప్టెంబర్ 16 (చక్రవాణి న్యూస్) : మల్హర్‌రావు మండలంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 15 మందిని ఎంపిక చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జి. లక్ష్మణ్ బాబు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 16న కొయ్యూరు ఎంఆర్‌సీ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఉపాధ్యాయుల పేర్లను ప్రకటించారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో ఎల్. రాజు నాయక్, పి. మానస, సిహెచ్. పూర్ణచందర్, జి. తిరుపతి, బి. రమేష్, కె. రాధిక, ఎం. నర్సయ్య, పి. సత్యనారాయణ, డి. చంద్రశేఖర్, జి. శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్, టి. మహిపాల్, పి. తిరుపతి రెడ్డి, బి. సాంబయ్య, ఎం. రమేష్ ఉన్నారు.అదేవిధంగా ఎంపీపీ ఎస్ వెల్మలపల్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్. సురేష్, కె. గంగారాజులను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు అధికారులు తెలిపారు.మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తూ నిర్వహించే కార్యక్రమానికి మండలంలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
COMMENTS